Seed Bank – విత్తన బ్యాంక్

Details

మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు పంటలను ప్రభావితం చేసాయి. విత్తుతో రైతుకుండే అవినాభావ సంబంధాన్ని దూరం చేసాయి. రైతు విత్తును అనివార్యంగా కొనుగోలు చేయడమో, లేదంటే, అందుకోసం ఇతరుల మీద ఆధారపడటమో మొదలైంది. రైతుల ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ, విదేశ కంపెనీలు హైబ్రీడ్ల పేరుతో నాసిరకం విత్తనాలను కూడా రైతులకు అధికధరలకు అంటగడుతున్నాయి. ఫలితంగా అద్భుతమైన అనేక వేల రకాల దేశవాళీ విత్తనాలకు దూరమయ్యాం. ఇదొక పరిణామ క్రమం. ఈ క్రమంలోనే అనేక నష్టాలను చవిచూసాం. ఏం కోల్పోయామో, ఏమిటి కాపాడుకోవాలో తెలుసుకున్నాం. ఎలాంటి కీలక అడుగులు వేయాలో అర్థం చేసుకున్నాం. అలా అర్థం చేసుకుని, అడుగులు వేయాలనుకున్న సంస్థల్లో సుస్థిర వ్యవసాయ కేంద్రం ముందు వరుసలో ఉంది. అందుకే మన విత్తనం మన చేతుల్లో ఉండాలంటూ, విత్తన బ్యాంకుల ఏర్పాట్ల కోసం తన వంతు కృషిని కొనసాగిస్తోంది.