మట్టి ..వేర్లు వెతుక్కుంటున్న వ్యవసాయం

Details

ఈ రోజు మీరు తిన్న ఆహారం పండించిన రైతు మీకు తెలుసా? తను ఇంకా బ్రతికే వున్నారా? గత ఇరవై సంవత్సరాల లో అరగంటకి ఒక రైతు చనిపోతూ వుంటే, ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడున్నర లక్షల మంది చనిపోతుంటే … ఏమి జరుగుతుంది అని …వ్యవసాయ సంక్షోభం ఎందుకు పెరుగుతుందో ఆలోచించారా? చంపారణ్ సత్యాగ్రహం తర్వాత వంద సంవత్సరాలు గడిచినా రైతు ఉద్యమాలు ఎందుకు బలపడలేదు? “భారతదేశం లో రైతులు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చనిపోతారు” అని 1928 లో రాయల్ కమిషన్ చెప్పింది. ఇప్పటికి రైతులు అప్పుల్లోనే వున్నారు, అప్పులతోనే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నాటి నుంచి 2007 స్వామినాథన్ కమిషన్ వరకు అనేక కమిషన్ లు వందల సిఫారుసులు చేసినా రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు? ఆరోగ్యం కోసం అని తినే ఆహారం ఈ రోజు అన్ని అనారోగ్యాలకు కారణం ఎందుకు అవుతోంది? దేశం మొత్తానికి ఆహారం అందించే పంజాబ్ ఈ రోజు కాన్సర్ రాజధాని ఎందుకు అవుతోంది? ఆధునికత పేరుతో సరైన పరీక్షలు చేయకుండానే జన్యుమార్పిడి పంటలు, కొన్ని రకాల పురుగు మందులు రైతుల మీద ఎలా రుద్ద బడుతున్నాయి? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? గ్రామాలు ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు? ఈ ప్రశ్నలు మన చుట్టూ చాలా రోజులుగా వున్నాయి, వీటికి సమాధానం వెతుక్కునే క్రమం లో కొన్ని వాస్తవ అనుభవాల ఆధారంగా తమ వ్యవసాయాన్ని నిలబెట్టుకోవటానికి కొందరు రైతులు, తమ ఉనికిని కాపాడుకోవటానికి కొన్ని గ్రామాలు, వారికి సాయంగా కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను మీ ముందుకు తేవటానికి చేస్తున్న ప్రయత్నం ఈ ‘మట్టి’ వేర్లు వెతుకుంటున్న వ్యవసాయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది స్వచందంగా చేసిన సహాయంతో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ‘మట్టి’ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ‘ఏక్త’ వ్యవసాయ సంక్షోభాన్ని, ప్రత్యామ్నాయాలు వెతుక్కోవటం కోసం చేసిన ప్రయత్నాలకు రూపం. వ్యవసాయంలో నష్టపోయి అమ్మకానికి పెట్టబడిన ఒక గ్రామం కథ. దిగుబడుల కలల్లో ఇరుక్కు పోయి పురుగుమందులు, అప్పులు, మార్కెట్లు తినేస్తు వుంటే అటు చావుకి బ్రతుకు కి మద్యలో ఊగిసలాడుతూ జీవన పోరాటం చేస్తున్న రైతుల కల. వ్యవసాయం సంక్షోభం లో కుటుంభ సభ్యులని కోల్పోయిన కొందరు మహిళా రైతులు చేసిన పోరాటం ఈ కథ. సుస్థిర వ వ్యవసాయ కేంద్రం, రైతుస్వరాజ్య వేదిక సభ్యులతో కలిసి అనేక గ్రామాలలో తిరిగి రైతులతో మాట్లాడి ఒక సంవత్సరానికి పైగా వ్యవసాయ సమస్యలపై చేసిన పరిశోధన చేసి అన్షుల్ సిన్హా మరియు బృందం తీసిన చిత్రం. రైతులు రోజువారీగా ఎదుర్కునే 25 పైగా సమస్యలు…వాటిని ఎలా పరిష్కరించుకున్నారు అనే అంశాలతో ఈ చిత్రం మలిచారు. ఈ చిత్రాన్ని మీ గ్రామాల్లో ప్రదర్శించాలనుకున్నా, ఇలాంటి వ్యవసాయ పద్దతులగురించి నేర్చుకోవాలనుకున్నా మమల్ని సంప్రదించండి. అలాగే సహాయం చేయాలనుకుంటే http://www.csa-india.org/donate లో చేయండి. call on 08500983300 or email to csa@csa-india.org