సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం

Details

ఖరీఫ్ లో సాంబమసూరి వరిరకానికి సుడిదోమ విపరీతంగా ఆశిస్తుంది. ఈ సుడిదోమను తొలిదశలోనే గుర్తించి, చర్యలు తీసుకుంటే, పంట నష్టాన్ని నివారించుకోవచ్చు. తూటికాడ ఆకులు పదికిలోలు, పశువుల మూత్రం పదిలీటర్ల చొప్పున తీసుకుని, ఉడికించి, చల్లార్చిన తరువాత, ఈ కషాయాన్ని సుడిదోమ నివారణకు వాడుకుంటే, మంచి ఫలితాలుంటాయి.