దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను …

Details

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను …

పాడినవారు: గిరిబాబు, ఎనేబావి

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

సంత నడుమ జోలె బట్టి ఒక పసి గొంతు మోగుతుంటే…

నువ్వది గేయం అన్నావు….నేనది గాయం అన్నాను…

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

బల ప్రదర్శన కోసం ఒక్కడు పులులు చంపుతుంటే…

నువ్వది శౌర్యం అన్నావు…నేనది క్రౌర్యం అన్నాను..

బల ప్రదర్శన కోసం ఒక్కడు పులులు చంపుతుంటే…

నువ్వది శౌర్యం అన్నావు…నేనది క్రౌర్యం అన్నాను..

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటె…

అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటె…

నీవది కంకణమన్నావు ..నేనది సంకెళ్ళన్నాను

నీవది కంకణమన్నావు ..నేనది సంకెళ్ళన్నాను

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెపుతుంటే…

నీవది వినోదమన్నావు…నేనది ప్రమాదమన్నాను

నీవది వినోదమన్నావు…నేనది ప్రమాదమన్నాను

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను

అందరి కోసం ఒక్కడు తన ప్రాణాలను అర్పిస్తే..

అందరి కోసం ఒక్కడు తన ప్రాణాలను అర్పిస్తే..

నీవది మరణం అన్నావు…నేనది జననం అన్నాను

నీవది మరణం అన్నావు…నేనది జననం అన్నాను

దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్ట ని విన్నాను…

నువ్వది వాదం అన్నావు…నేనది వేదం అన్నాను